Sunday, September 30, 2007

Monday, September 17, 2007

Sunday, September 9, 2007

హైదరాబాద్ కి ఏదో అయింది....


మొన్న బాంబులు, ఇవ్వాళ బ్రిడ్జి.......హైదరాబాద్ కి ఏదో అయింది....
ఈ రోజు సాయంత్రం బాగా రద్దీగా వుండే ఏరియా పంజా గుట్ట లో నిర్మాణం లో వున్న ఫ్లై ఓవర్ కూలి 20మంది మరణించారు పలువురు గాయపడ్డారు.....
వరుసగా జరుగుతున్న ప్రమాదాల వల్ల హైదరాబాద్ ప్రజల మనసులు నిజంగా ఆందోళన చెందుతుంటాయి.....వారికి తగిన ధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుందాం
Image :IBN Live

Monday, August 27, 2007

పాపం సచిన్........!


అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల అయిదు సార్లు అనవసరంగా ఈ మధ్య కాలంలో 99 వద్ద సచిన్ అవుట్ అవ్వడం చూస్తుంటే, మామూలుగా సెంచరీ దగ్గర పడ్డప్పుడు నెమ్మదిగా ఆడే సచిన్ కంటే అంపైర్లే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నారు, పాపం...అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోనట్టయితే సచిన్ మరిన్ని సెంచరీలు చెయ్యగలిగే వాడు.. కాని ఒక్కటి మాత్రం నిజం, 99 స్కోరు వద్ద అవుట్ కావడం వల్ల ప్రతి ఒక్కరి అభిమానం మళ్ళీ అతని వైపే మళ్ళింది.

నా సంగీతం ప్రజల కోసమే.... ---రెహమాన్

From : Enaadu E-Paper.

Saturday, August 11, 2007

ప్రైవేటు రంగంలో స్వచ్చంద కోటా

ఈ రోజు ఉదయాన్నే ఈనాడు చూస్తుంటే ఒక వార్త ఆసక్తికరంగా కనిపించింది..."ప్రైవేటు రంగంలో స్వచ్చంద కోటా"యూపీ ప్రభుత్వం కొత్త పథకం అమలు చేసింది.... ఇక నుండి రిజర్వేషన్ అమలు చేసే కంపేనీలకు రాయితీలని ఇస్తుంది.
పేరుకి ఈ దేశం లో ప్రతి ఒక్కరికి సమాన హక్కులున్నా, రిజర్వేషన్ అంటూ మరొకటంటూ ప్రత్యేక హక్కులెందుకు కల్పిస్తున్నారో అర్థం కావట్లేదు....
దీనిపై మీ అభిప్రాయాన్ని comment లా add చెయ్యండి...

Sunday, July 22, 2007

తోలుబొమ్మ.....



మన నాయకులు మరో తోలుబొమ్మను దేశాధ్యక్ష పదవిని ఎక్కించారు.బహుశా... ఇంత వరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఇదేనేమో కొంచెం పోటా పోటీగా జరిగిన ఎన్నికలు.ఎలా జరిగితే ఏంటి? ఒరిగేదేం లేదుకదా.....చిన్నప్పుడు సాంఘికశాస్త్రం పుస్తకాల్లో రాష్ట్రపతి "రబ్బర్ స్టాంప్" లాంటి వాడు అంటే సరిగా అర్ఠమయ్యి చచ్చేది కాదు... ప్రతి బిల్లు, ప్రతి శాసనం రాష్ట్రపతి సంతకం లేనిదే అమలు జరగదు కాని ఏంచేద్దాం...? అతను కేవలం సంతకం మాత్రమే చేయాలి....( క్షమించండి అతను/ఆమె) అప్పుడెప్పుడో అబ్దుల్ కలాం బిల్లు తిప్పి పంపాడన్న విషయం తప్ప, రాష్ట్రపతి గురించి వార్తలు మనం కేవలం ప్రారంభోత్సవాలు, పట్టా ప్రధానోత్సవాలు, బహుమతి ప్రధానోత్సవాలు, ప్రమాణ స్వీకారోత్సవాలు లాంటివి తప్ప ఇంకోచోట చూడం.
ఇదంతా ఇలా జరగడానికి ఏదైనా కారణం కావొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం లో వున్నప్పుడు వారి అభ్యర్ఠిని, మరో ప్రభుత్వం వారి అభ్యర్ఠిని ఇలా... ఎన్నుకొని వాళ్ళ పనులని జరిపించుకొంటున్నారే తప్ప, దేశానికి రాష్ట్రపతి ఎలాంటి వాడుకావాలి? అని ఎవరూ అలోచించరు...
అబ్దుల్ కలాం ఇప్పటి వరకూ వున్న వారిలో కొంచెం బెటర్ ...
దేశ ప్రజలకు తన చివరి సందేశాన్ని ఇలా పంపారు....
"మై నిరంతర్ చడా... చడతారహా, శిఖర్ కహ హై మేరే ఈశ్వర్?
మై నిరంతర్ ఖోజ్ తా రహా, ఖోజ్ తా రహా,
జ్నాన్ కా భండార్ కహాహై మేరె ఈశ్వర్?
మై నావ్ ఖేతా రహ.. ఖేతా రహ....
శాంతీ కా ద్వీప్ కహ హై మేరే ఈశ్వర్...?
హే మేరే ఈశ్వర్,
మేరా దేశ్ కో దూర్ దృష్టి ఔర్ మెహనత్ సె ఆనంద్ ప్రాప్తి కా వర్ధన్ దో..."
ఈ సారైనా ఈ రాష్ట్రపతి అలా చెయ్యరని ఆశిద్దాం...

Wednesday, July 11, 2007

విజయీభవ!

hi Khanna
వున్నత విద్యకై, అమెరికా వీసా దొరికిన శుభ సందర్భం లో అందుకో మా శుభాకాంక్షలు....
-GemsOfHindupur

Thursday, June 21, 2007

సంతోషం సగం బలం


పూర్తీ వ్యాసం ఇక్కడ చూడండి.

Text :EENADU.

Sunday, June 3, 2007

"ఆర్ట్ ఆఫ్ లివింగ్"


"ఆర్ట్ ఆఫ్ లివింగ్" గురించి పూర్తీగా ఇక్కడ తెలుసుకోండి.
http://eenadu.net/htm/weekpanel1.asp

సౌజన్యం :ఈనాడు ఆదివారం

Wednesday, May 2, 2007

తధాగతుడు



ఆ నాడు రాజాంగణంలో కాలసూచిక అర్ధ రాత్రిని సూచిన్నిస్తున్నది. ఎంతకూ ఎడ తెగని ఆలోచనలు యువరాజు అంతరంగాన్ని కలచి వేస్తున్నాయి, కృంగదీస్తున్నాయి ....

క్షణాలు వెనక్కు దొర్లాయి.......... ఆ రోజు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొన్నాడు సిద్దార్ఠుడు.
భారంతో ఓ ముదుసలి వణుకుతూ తన రథానికి ఆడ్డుగా వచ్చాడు. ఆతని ముఖం వికృతంగా ముడుతలుపడి వుంది, నడుం వంగి వుంది.... కంఠం కంపిస్తున్నది.... అడుగులు తడబడుతున్నాయి..... ఎవరతడు ఎందుకలా అయ్యాడు....?

సారధి వేషమని చెప్పాడు.


సారధి చెప్పింది నిజమేనా? అది వేషమే అయితే అలా లోకంలో లేని పాత్రను అతను ఎందుకు ధరించాడు అలా అభినయించగలిగాడు?????


మరో వీధిలో ఒక మానవాకారాన్ని ఒక కొయ్య చట్రం పైన వుంచి నలుగురు మోసుకెల్తున్నారు.వెనుక పదిమంది నడుస్తున్నారు.... దాన్ని తీసుకెళ్ళి నిప్పుతో కాలుస్తున్నారు....అది చూసి " ఆపండి ఈ ఆగడలను సహించబోడు" అంటూ రథం దిగబోయిన సిద్దార్థునికి అది మానవ శరీరం కాదు అని.. కొయ్య అని వినోదం కోసం అల చేస్తున్నారని చెప్పాడు.


సారధి ప్రసంగం అసంధర్భంగా తోచింది సిద్దార్థునికి.
ప్రక్కనే ఒక బాలుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు."బాబు ఎందుకేడుస్తున్నావు? ఎవరైనా ఎమైనా అన్నారా? నాకు చెప్పు నేను శిక్షింపజేస్తాను" అన్నాడు.


క్షణకాలం లో శుద్దోదనుని శాసనం పిల్లవాడికి గుర్తుకొచ్చింది. పిల్లవాడు ఆచార్యుల ఆదేశానుసారం రాగధ్యయనం చెస్తున్నానని అబద్దం చెప్పాడు.


యువరాజు మతి విచలితమయింది.


ఇలాంటివి చాలా చూసాడు..... ఎవరి మాటలు నిజాలుగా తోచట్లేదు....
తదేకంగా తన పుత్రున్ని చూస్తూ భవిష్యత్తును ఊహించాడు. రాహులున్ని కట్టెలపై వుంచారు... మండుతున్న కొరివితో కట్టెల్ని ముట్టించారు..... ఒక్క సారి మనస్సు జలదరించింది.. హృదయం ద్రవించింది... మనస్సు ఆక్రోశించింది..........


అతలాకుతలమవుతున్న తన మనసుని కుదుట పరచలేక సమాధానం కోసం మహా నిశీధిలో రాజసౌధాన్ని విడిచి బయలు దేరాడు......


రోజులు వారాలు నెలలు ..... అల నడుస్తూ వెళ్ళి నీరసించిపడిపోయాడు....

కనులు తెరిచాడు..... తను ఉన్నది తన తల్లి మాయాదేవి ఒడిలో అనుకున్నాడు.... కొద్ది సేపటి తరువాత గతం గుర్తొచ్చింది..... నా అశాంతిని బాపే ఉపాయం చెప్పమని అడిగాడు... "అత్మాహుతి మాత్రం కాదు..... జ్నానాన్వేషణలో శరీరాన్ని కృశింప చేయరాదని మీలోని దివ్యశక్తి మానవాలికి ప్రశాంతి ప్రదాయిని కావాలని" చెప్పింది...
వింటున్న సిద్దార్ఠునికి తొలిసారిగా ప్రపంచమూ ప్రకృతి గోచరించింది.......


చాలారోజులు అడవిలో వుంటూ కొందరు శ్రవణులతో కలసి వారిమాటలు వింటూ వారి సిద్దాంతాలు అర్థం చెసుకుంటూ కొన్నాళ్ళు గడిపాడు.....


వారి సిద్దాంతాలను అర్థం చెసుకొని వారి సాంగత్యం లో వివిధ మతాల సిద్దాంతాల్ని అధ్యయనం చెసాడు.......
చివరికి భోది వృక్షపు ఛాయలో ఆష్టాంగ సాధన కనిపెట్టి బుద్దుడైనాడు.....


ఆయన అష్టాంగ సాధన ఇది....


సమ్యగ్దృష్టి ---- సరియైన అవలోకన(అర్ఠం చేసుకోవడం)

సమ్యక్సంకలనము ---- సరియైన లక్ష్యము.

సమ్యగ్వచనము ---- సరియైన సంభాషణ

సమ్యక్కర్మ ---- సరియైన పనులు

సమ్యగా జీవనం ---- సరియైన జీవితాన్ని గడపడం

సమ్యగ్వ్యాయామాలు ---- సరియైన నడవడిక

సమ్యకృతి ---- సరియైన జ్నాపికలను నిలుపుకోవడం

సమ్యక్సమాధి ---- సరియైన ధ్యానాన్ని అలవర్చుకోవడం
వీటితో పాటు చతుస్సత్యములను నిత్యమూ గుర్తెరగాలని చెప్పాడు... అవి...
దుఃఖము

దుఃఖ కారణము

దుఃఖ నిరోదము

మరియు దుఃఖ నివారణమునకు ఆష్టాంగ సాధన.......

సత్యాహింసలు, శాంతి ధర్మాలు.. ఆయన ఉపదేశించిన ప్రధాన సూత్రాలు....
దేశం నలు మూలలనుండి ఎంతోమంది భోధనలకు ప్రభావితమయ్యరు... బౌద్దమతం విస్తరించింది....
కన్నులతోనే సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించి ప్రజల హృదయాలపైన చెరగని ముద్రను వేశాడు......


బుద్ద పౌర్ణమి సంధర్భంగా .......
మూలం :తధాగతుని కథ - నెట్యం రతన్ బాబు.

Friday, April 20, 2007

కార్డులు చెప్పిన కథ....



ఈ కార్డు ముక్కలేంటి?? ఈ భాష ఏంటి? ఈ దిలీప్ కుమార్ చక్రబోర్తి ఎవరు? అని చూస్తున్నారా?
అర్టం కావడం లేదు కదూ........................................ :-)
ఏం పర్వాలేదు... నాకు కూడా ఏమి అర్ఠం కాలేదు.....అది రాసిన భాష బెంగాలి అని తప్ప...
ఇంతకీ వీడి బాధ ఏంటి అనుకొంటున్నారా... చెబుతాను....
ముందు శనివారం నాడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక, ఉత్తరాల పెట్టెలో మనకేమైనా ఉత్తరాలొచ్చాయా అని చూసాను। అందులో ఈ రెండు పోస్ట్ కార్డులు కనిపించాయి। మనకు కార్డు రాసిన వాడెవడా అని చూసాను। అది ఎవరో దిలిప్ కుమార్ చక్రబోర్తి కి రాసిన ఉత్తరాలు। అంతేకాక ఇవి రెండూ మా ఇంటికి రాసిన ఉత్తరాలు కావు. మొత్తం బెంగాలి లో రాసుండడం వల్ల నాకు తెలిసిన రెండు మూడు బెంగాలి అక్షరాలు ఎక్కడయినా కనిపిస్తాయేమో అని చూసాను. హౌరా లో హ... కోల్ కతా లోని క... వీటి కోసం వెటికాను... కాని లాభం లేక పోయింది. వాటిని ఆటు, ఇటు తిప్పి చూస్తే అర్థం అయింది... ఇవి ఎప్పుడో డెబ్బయ్ లలో రాసిన వుత్తరాలు అని... ఒకటి 1972 ఇంకొకటి 1976.
పాకిస్థాన్ నుండి మరొకటి బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఉత్తరాలివి.
వీటిలో ఎదో కిరికిరి ఉందిరా అనుకున్నా.... ఇంక తీసుకువచ్చి చూసాను॥ పోస్టల్ స్టాంప్ ఎక్కడిదా అని ॥ ఆప్పుడు కొంచెం కొంచెం కథ అర్థం అయింది. ఆ రెండు ఉత్తరాలు నిజానికి రాసింది ఒక ఊరు నుండే!చాంద్ పూరని బంగ్లాదేశ్ లోని ఓ చిన్న ఊరు. ఇంతలో మా బెంగాలీ రూమ్ మేట్ ఆఫీస్ నుండి వచ్చాడు......ఇద్దరూ ఒకే ఆఫీస్ లోనే పని చేస్తున్నా నేను చాల పంక్చువల్ కనుక ॥ ముందే వచ్చెసా, వాడు రాగానే రెండు ఉత్తరాలు వాడి చేతిలొ పెట్టి చదువు గట్టిగా అన్నాను, వాడు చదివిన దాని ప్రకారం .. వాటిలో ఏ నక్సల్, తీవ్రవాద రహస్యాలేమి రాసి లేవు. అవి మామూలు కుశల ప్రశ్నలు వేసిన ఉత్తరాలే.కాని అవి చారిత్రాత్మక ఉత్తరాలు .. నలభై ఏళ్ళ క్రితం రాసినందుకు మాత్రమే కాదు, ఈ రెండు ఉత్తరాలు టూకీగా మనకు బంగ్లాదేశ్ చరిత్ర చెబుతాయి ..


During the partition of India into India and Pakistan in 1947 Bengal was also divided on purely religious basis with Hindu dominated Western part of Bengal going to India and the Eastern part with majority of Muslims going to Pakistan. This East Bengal was called East Pakistan which was separated by around 1600 kilometers from West Pakistan. The Eastern wing which was dominated by Bengali speaking population, was dissatisfied with the government based in Western wing over economic and cultural issues. Poor response from the government after the devastation of coast of East Pakistan by a massive cyclone in 1970 outraged population of East Bengal. This eventually led to Bangladesh Liberation War which lasted for 9 months. Around 3 million were massacred and millions fled to neighboring India, mainly to Calcutta. In December 1971 the war received support from Indian Armed forces and a decisive victory of India on Pakistan on 16th December 1971 led to the independence of Bangladesh under the leadership of Sheikh Mujibur Rahman.
After independence of Bangladesh it became a parliamentary democracy and first parliamentary elections were held in the year 1973. antey aa paina unna modati uttaram dated 08.07.1972 ee transition period ( from East Pakistan – Bangladesh) lo raasinadi .. mari aa rendava uttaram .. modati prabhutwam erpadina tarvata raasinadi ..
Bangladesh never actually recovered from the political violence and turmoil and nor did Calcutta ever recover from the problems aroused from the infiltrated refugees from Bangladesh. Bangladesh has had 13 different heads of government and at least four military coups since independence. Even today if you walk through the streets of Kolkata, you find a number of ghettos and large number of people starving on footpaths. Neither could they ever go back to their home land nor could they ever ascertain themselves in Kolkata.
Even after the repeated examples from history of the ill effects of partition, whether it is partition of India and Pakistan, or partition of Pakistan or it is partition of Uttar Pradesh and Uttaranchal, or it is Bihar and Jharkhand..
I personally just do not want Andhra Pradesh and Telangana to be added to this list of partitioned.




Thursday, April 12, 2007

కొత్త వాన లోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా........?




ఈ రోజు మా వూళ్ళో వర్షం వచ్చింది..... తొలకరి జల్లుల్లో తడిసి ఇప్పుడే ఈ బ్లాగ్ రాస్తున్నాను. ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చిరు జల్లులు మొదలయ్యాయి... ఆ వాసన ఆస్వాదిస్తోంటే చిన్నప్పటి జ్నాపకాలన్ని అలా నా కనులముందు పలకరిస్తూ మనసుని ఆహ్లాద పరుస్తూ అలా మాయమయిపోయాయి.
చిన్నప్పుడు మా పల్లెలో వర్షం వచ్చినప్పుడు ఆడుకున్న పడవల ఆట, వడగళ్ల వాన పడ్డప్పుడు వడగళ్ళతో ఆడిన ఆటలన్నీ గుర్తుకు వచ్చాయి....
జ్నాపకాలు జీవితంలో ఆనందాన్ని తెస్తాయి.... జ్నాపకాలు అంటే ఇంకోటి గుర్తొచ్చింది... నేను ఇంటర్ లో వున్నప్పుడు నాకు చాలా సన్నిహితుడైన వాడితో గొడవ పడ్డాను.... అప్పుడు ఇంకొక మితృడు వచ్చి.. మీ ఇద్దరి మధ్య గొడవ మాయం అవ్వాలంటే మీ ఇద్దరి మధ్య జరిగిన మంచి సంఘటనలు గుర్తు తెచ్చుకొమ్మని చెప్పాడు... అది చాలా దోహదపడింది.....
మొత్తానికి ఈ రోజు ఈ సంవత్సరంలో అన్నింటికన్నా ఆహ్లాదకరమైన రోజు......

Wednesday, April 4, 2007

బెలుం గుహలు



బెలుం గుహలు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కే తలమానికమైన ఈ ప్రదేశం చూడదగిన వాటిలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది। ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు కోటి రూపాయలు పైగా ఖర్చు చేసి దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు। 2002 లో మొట్ట మొదటి సారిగా సందర్శకులకు వెలుగులోకి వచ్చిన ఈ గుహలు దాదాపు భూమి లోపల దాదాపు 10 కి.మి వ్యాపించి వున్నాయి. చిన్న బావి ద్వారా లోపలికి ప్రవేశించే వరకు మనకు ఇలాంటి గుహలు ఇక్కడ వున్నాయి అని మనం అసలు ఊహించలేము, ఎందుకంటే ఈ గుహల పైభాగమంతా వ్యవసాయభూములున్నాయి. సహజసిద్దంగా నీటి ప్రవాహాల వల్ల ఏర్పడిన ఆకృతులు పైనుండి వేలాడుతూ అందరిని అబ్బురపరుస్తూ వుంటాయి.
దీని చరిత్ర పరిశీలిస్తే
4500 BC ఈ కాలం నాటి మట్టి పాత్రలు బయట పడ్డాయి
మధ్య కాలం లో జైనులు బౌద్దులు ఆక్రమించుకున్నారు
1884 రాబర్ట్ బ్రూస్ అను అతడు మొదటి సారిగా కనుగొన్నాడు
1982 డేనియల్ గేబర్ అను జర్మన్ దేశీయుడు
1988 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్రమించుకుంది
1999 టూరిజం శాఖ అభివృద్ది పరచింది
Feb-2002 ప్రజల సందర్శనార్టం అనుమతిఈ చక్కని ప్రదేశం బెంగళూరు నుండి 300km హిందూపురం నుండి 192km అనంతపురం నుండి 90km నంద్యాలనుండి75km తాడిపత్రి నుండి 35km హైదరాబాదు నుండి 320 km వుంటుంది.

చిత్రాలు : తెలుగు వికిపీడియ.

Friday, March 30, 2007

పెళ్ళెప్పుడు వ్యాసం సృష్టించిన కలకలం

శుక్ర వారం ఆఫీస్ కి వెళ్ళ గానే ఒక మిత్రుడి నుండి వచ్చిన రెండు రెళ్ళ ఆరు బ్లాగ్ లోని పెళ్ళెప్పుడు అన్న వ్యాసం చదివాను, ఆందులో పెళ్ళి విషయం లో అబ్బాయిల భాదల్ని వివరిస్తూ చాలా బాగా హస్యాన్ని పండించారు....
సరే బాగుంది వ్యాసం అని నా మెయిల్ లిస్ట్ లోని అందరికి ఆ వ్యాసాన్ని పంపాను..... పొరపాటున అమ్మాయిలకు కూడా....అంతే ఇక నా మెయిల్ బాక్స్ లో ఉత్తరాల వరదొచ్చింది।

అందులో ఆసక్తి కరమైన కొన్ని నా బ్లాగ్ లో ప్రచురించాలని అనుకొన్నాను

ఒక అమ్మాయి మెయిల్ ఇలా వుంది....

హాయ్ కార్తీక్, అండ్ ఆల్.... వెరీ గుడ్ మార్నింగ్
కార్తీ, నీ ఆర్టికల్ చదివా, మొదట్లో చాలా కొప0 వచ్చింది, కాని లాస్ట్ లైన్ చదివాక కాస్త తగ్గింది.
నాకు, అబ్బాయిలు పెళ్ళంటె స్వతంత్రాన్ని కోల్పోతామని ఎందుకు అనుకొంటారో అర్థం కాదు, భయపడాల్సింది అమ్మాయిలు కదా, ఎందుకంటే వాళ్ళు తమ స్వతంత్రాన్ని కోల్పోతారు కనుక, నిజంగా చెప్పలంటే అబ్బయిలు పెళ్ళికి ఎందుకు సిద్దంగా వుండరు అంటే,
1 వాళ్ళకి జీవితంలో చాలా ఎంజాయ్ చెయ్యాలని వుంటుంది।
2 వాళ్ళకి పెళ్ళాం పిల్లల బరువు భాద్యతలు తీసుకోవాలని వుండదు
3వారికి జీవితం లో భాద్యతలు వుండకూడదు।


ఇవన్ని కొంతమంది కాదు చాలా మంది ఒప్పుకోరు పైగా పెళ్ళి చెసుకుంటె వచ్చే పెళ్ళాం వాళ్ళని అన్నింటికి అభ్యంతర పరుస్తుందని సొల్లు మాటలు చెప్పి తప్పంతా అంతా ఆ అమ్మాయి మీదికే తోస్తారు.. నిజం చెప్పాలంటె అమ్మాయిలే స్వతంత్రాన్ని పోగొట్టుకొంటారు. అంతేకాదు వాళ్ళ ఇష్టాలు..అన్నీ....
ఇంకా పెళ్ళి అవకనే కేవలం ఫిక్స్ అయిందని తెలియగానే అమ్మాయి మీద డామినేట్ చెయ్యటం మొదలు పెడుతారు.. వారితో మాట్లాడకు, వీరితో మాట్లాడకు .అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు..అలా వుండు,ఇలా వుండు..ఆ డ్రెస్ వెసుకో అంటూ ఇలా లక్ష కండీషన్లు పెట్టి టార్చర్ పెడతారు..ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా వుంటుంది.
ఇంక పెళ్ళి చూపుల విషయానికి వస్తే మాకు ఆ టార్చర్ ఉంటుంది...ఇష్టం వున్నా లేకున్న ఫొటొలు తీసుకోవటం పెళ్ళి చుపులు అనే ఒక స్టుపిడ్ ఇడియట్ పద్దతిని బలవంతంగా కుర్చోబెడతారు..
ఇక్కడ నా విషయంలో జరిగినది చెప్తాను....
నేను MCA 6th sem లో వున్నప్పుడు నాకు ఇష్టం లేకున్నా మా అమ్మానాన్న పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు, అబ్బాయి వాళ్ళ అన్న, నాన్న వచ్చారు(ఇది చదివాక దీన్ని పెళ్ళి చూపులంటారో ఇంకేమంటారో మీరే చెప్పాలి)
అబ్బాయికి 29 yrs నాకు అప్పుడు 23 ఆ అబ్బాయి చదువు పూర్తీ చేసిన తరువాత ౩ yrs బేవార్స్ గా వుండి తరువాత ఏదో టెలికాం కంపెనీ లో వుధ్యోగం సంపాదించాడట(జీతం 18K బెంగళూరు లో)

వచ్చి కూర్చున్నాను ఇంటర్యూ స్టార్ట్ అయింది।

కనీసం పేరు కూడా అడగలేదు...

వాళ్ళు : ఏం చెస్తున్నావమ్మా?
నేను : MCA 6th sem
వాళ్ళు : percentage ఎంత?
నేను :76
వాళ్ళు10th ఎంత?
నేను : 68
వాళ్ళు : డిగ్రీ ఇంటర్?
నేను : 61 and 71
వాళ్ళు: ఉద్యోగం చేస్తావా?
నేను : అవును, చేస్తాను॥

yekkadaina studies lo fail ayyi yrs waste ayyaya?... i got angry..hurt...said NO
he told yenduku adugutunnanatey yrs gap vastey job raadu kada so andukey mundu adigaanu ani annadu aa stupid
after that u know frnds how much dowry he asked???

HE ASKED FOR A DOWRY OF 20,00,000
yes aksharaala 20 lacs???
what do u guys think of girls? and her parents??
thokkalo vaadu 18,000 thousand sampadistey adi bglr loo how can he feed hisfamily.... malli vaadiki anta katnam.. yem velaga bedtadooo Emo....


ఆ అమ్మాయి మెయిల్ కి మరో అమ్మాయి ప్రత్యుత్తరం ఇలా వుంది...
కట్నం ఇచ్చే వాల్లు ఉంటారు కాబట్టే తీసుకోనే వాళ్ళూ కూడా వున్నారు...తీసుకోవడం బాగోలేదు అంటే ఇవ్వడం కూడా బాగోలేనట్టే॥

నేను కట్నం తీసుకోని వాళ్ళను చూశాను, ఇలా అందరిని తూలనాడటం బాగోలేదు అంటూ సమాధానం ఇచ్చింది..


తరువాత చివర్లో మరో మిత్రుడు(పెళ్ళైన) మొదట అమ్మాయికి ఇలా సమాధానం ఇచ్చాడు...

Hi All,

To whomsoever this MAIL is concerned....................

What you all have discussed are truths...everybody are speaking TRUTH ONLY...but few things have got formulated during the evolution of LIFE...So people follow that....if somebody is not really interested....don't break the rule...dare to change the society and the formulated rules ( Re-innovation ). But don't say that Boys are bad and Girls are good....and vice versa....

People who are interested to get married....please get married....and enjoy the life.....

I will just define PRE MARRIAGE & POST MARRIAGE below:

Pre Marriage: You enjoy EVERYTHING and miss SOMETHING
Post Marriage: You enjoy that SOMETHING and miss EVERYTHING.

But if you are good COUPLE...you can enjoy that missed SOMETHING and also EVERYTHING.

I wish you all the best........


తరువాత చివర్లో మరో మిత్రుడు(పెళ్ళైన) మొదట అమ్మాయికి ఇలా సమాధానం ఇచ్చాడు...
ఇలా రోజంతా వచ్చిన ఉత్తరాలలో మూడు మాత్రమే మీకు అందించాను అదీ క్లుప్తంగా....
నాకు మొత్తం రోజులో సరాసరి ౩౦ ఉత్తరాలు ఈ విషయం పైనే వచ్చాయి..........
మొత్తానికి పెళ్ళెప్పుడు అన్న వ్యాసం రోజంతా కలకలం సృష్టించింది.....

Monday, March 26, 2007

శ్రీరామనవమి


శ్రీరామావతారం భగవంతుని అన్ని అవతారాలలోకెల్లా విషిష్టమైనది, మానవావతారం లో శ్రీమహావిష్ణువు అందరికీ అదర్శ ప్రాయుడైనాడు.
పితృవాఖ్య పరిపాలకుడిగా, జనరంజకంగా పాలించిన చక్రవర్తిగా, సీత పాలిట గొప్ప భర్త గా శ్రీరాముని స్ఠానం అత్యున్నతమైనది.
పురాణముల ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగమునందు దశరథ మహారాజు ప్రథమ సంతానముగా, ఛైత్ర శుధ్ధ నవమి నాడు జన్మించాడు, ఆ రోజుని మనం శ్రీ రామ నవమి గా జరుపుకొంటాం।

Friday, March 23, 2007

నా రెండు పాద రక్షలతో నమస్కారం



సూది మొన ఆనినంత భూమిని

సైతంవదలకుండా ఆక్రమించుకుంటూ

నీటిని ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్లలో నించి అమ్ముకుంటూ

గాలిని(ఆక్సిజన్ బాక్స్) పెట్టెల్లో బంధించి

సొమ్ము చేసుకొంటూ

నిప్పును సిలిండర్ లో నింపి వెలుగుకు వెలకడుతూ

చంద్రున్ని, ఆకాశాన్ని ప్లాట్లుగా చేసి

నిస్సిగ్గుగా మనిషి జేవితాన్ని శిలువ వేస్తూ

భూమి

నీరు

గాలి

నిప్పు

ఆకాశం

ప్రకృతి ప్రసాదించిన ప్రాణ ప్రదమైన అవసరాలన్నిటిని

కాసుల కోసం రాసులుగా పోసి

పంచభూతాలని వ్యాపార వస్తువులుగా చేసి

భూమండలంలో డబ్బు వున్నవాడే బతకాలని

లేనినాడు లేనివాడు తప్పకుండా చావాలని

భూమి నీరు గాలి నిప్పు ఆకాశం

వ్యాపార వస్తువులైతే చావక చస్తాడా

పంచ భూతాలు పంచ ప్రాణాలు తీస్తుంటే

క్షణ కాలం జీవిస్తాడా

మనుషుల జీవితాల్ని శాసిస్తున్న కార్పోరేట్ వ్యాపారానికి

నా రెండు పాద రక్షలతో నమస్కారం


వై। శ్రీరాములు గారిమూడు ఎడారులు ఏడు సముద్రాలు ఒకే ఒక్క అనంతపురం పుస్తకం లో నుండి నాకు నచ్చినవాటిలో మరొకటి..

చెప్పాలంటే ప్రతికవిత, తన మానవతా దృష్టికి అద్దం పడుతోంది।నాకు పుస్తకం బాగా నచ్చింది, ఈ మధ్యనే చదివాను॥

బిక్షా దేహి..

ఆకలితోనే ఇళ్ళ ముంగిళ్ళలో వేకువ మొగ్గేస్తుంది
శోకంతోనే లోకం వాకిళ్ళలో
రేకుల రెక్కలు తెరుచుకుంటుంది

అమ్మా.............
ఆకలి! ఇంత అన్నం పెట్టమ్మా!
పగటికి బిక్షం, సూర్యుడు

అమ్మా...
ఆకలి! ఇంత అన్నం పెట్టమ్మా!
చీకటికి బిక్షం చంద్రుడు

పగటికిచీకటికి బేధం తెలియనిది
నా దేశపు ఆకలి


-వై। శ్రీరాములు గారి
మూడు ఎడారులు ఏడు సముద్రాలు ఒకే ఒక్క అనంతపురం పుస్తకం లో నుండి నాకు నచ్చినవాటిలో ఒకటి

Tuesday, March 20, 2007

*************ఉగాది**********

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సఒవత్సరము ప్రకరముగా తొలి పండుగ ,ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ద ఏకాదశి రోజు వస్తుంది ఈ సారి అంటే 2007 సంవత్సరానికి శ్రీ సర్వజిత్తు నామ సంవత్సరం అని పేరు। ఈ సంవత్సరం చాలా విశేషమైనది ఎందుకనగా ఈ నామము యొక్క అర్ధము మానవులు తలపెట్టిన కార్యాలన్ని విజయవంతమగునని
ఈ సంవత్సరం పంచాంగం కొరకు దర్శించండి.....

Thursday, March 15, 2007

What it takes to be a GemsOfHindupur..?????


Being called a Gem of Hindupur ? is neither an accolade of bravery nor a mark of respect / mark of achievement. It's neither a notorious mob?nor a bunch of genius. But, It is a sense of being, feeling of Oneness. it's a way of life.

To be called so is no joke


You never know when ground starts sliding under whose feet while we meet.
Being together we have learnt to smile in grief, rather laugh out louder and louder at our weaknesses till they become our strengths. We have learnt to enjoy the cool breeze when the winds are flowing against us.


If you think it is being exaggerated ?. You have mistaken our confidence.
We do what we say and we say what we are capable of ? If you have met at least one of these Gems, you will not disagree with what is said.

Friday, March 9, 2007

యువతకు సిగ్గు చేటు ---- పూనే రేవ్ పార్టీ


ఇటీవల పూనే నగరం లో రేవ్ పార్టీ జరుపుకొంటూ పట్టుబడిన 251(వీరిలో 29 మంది అమ్మాయిలుకూడా వున్నారు. )మంది యువతను చూస్తోంటే పట్టాలు తప్పి ఫశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు తీస్తున్న భారత యువతకు అద్దం పడుతోంది. ఇన్ని రోజులు కేవలం విదేశాలకే పరిమితమైన ఇలాంటి దిక్కుమాలిన పార్టీల కోరల్లో మన దేశపు యువత చిక్కుకోవడం కొంత భాదను కలిగించే విషయం
ఇవన్నిటికీ కారణం యువతలో భాద్యతా రాహిత్యమా? వారిలో కొరవడిన అవగాహన? లేకపోతే తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? లేక ఇవన్నీనా?

కనీసం ఒక్కసారైనా వాళ్ళు ఇలా జరుగుతుందని ఊహించుంటే ఇలా జరిగి వుండేదా? ఇలా చేయడం తప్పు అని వారికి తెలియదా? పట్టుబడిన వారందరూ విద్యావంతులే, ఉన్నత సమాజానికి చెందిన వారే, కాని ఇలా ఎందుకు జరిగింది? ఇంత జరిగిన తరువాత కూడా కొంత మంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు మాదక ద్రవ్యాలంటే ఎమో తెలీదు అని వెనకేసుకు రావటం విస్మయం కలిగించే విషయం. మనం రోజూ వీక్షించే orkut ద్వారానే వీరందరూ తమ పార్టీ సన్నాహాలను పూర్తీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడూ తమ పిల్లల చదువుల సంగతే కాకుండా, వయసుకు తగ్గట్టుగా మారే పిల్లల మనస్తత్వాన్ని పరిశీలించి వారిని సన్మార్గంలో పెట్టగలిగినప్పుడే ఇలాంటివి మరీ మరీ జరగకుండా నివారించవచ్చు.



వంద కోట్ల భారతీయుల కలలను నిజం చేస్తారా?

ఇప్పటికే రెండు ప్రాక్టీస్ మ్యాచ్లలొ అద్భుత విజయాలను సొంతం చేసుకొని మంచి ఊపుమీదున్న ఇండియన్ క్రికెట్ టీం, ప్రపంచ కప్ లో జరిగే అన్ని మ్యాచ్ లలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని, వంద కోట్లభారతీయుల కలల్ని సాకారం చేయాలని ఆకాంక్షిస్తూ..............


Monday, March 5, 2007

ఎన్ని రంగులో, ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత
ఇక ఇన్ని ప్రత్యేకతలు కలిస్తే ఆ సంబరం అంబరాన్ని అంటకుండా ఎలా వుంటుంది.. ఈ ఫోటో చూస్తే తెలియట్లేదూ ..?

Friday, March 2, 2007

Starting.........


స్నేహం, ప్రకృతిలో ఒక తియ్యని సంబందం.....
మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ బ్లాగ్ ని ప్రచురిస్తున్నాం........

avandia