Saturday, June 14, 2008

ఒకే ఒక్క భోజనం వెల ఒక బిలియన్ డాలర్లు......!

ఇదేంటి.. ఏ బిల్ గేట్స్ తినేదో లేక ఎదో సౌది రాజు గారు తినే భోజనం విలువ అనుకున్నారా?
కానేకాదు....
అక్కడ మీరు తిన్నా నేను తిన్నా అంతే అవుతుంది... ఆలాంటి రెస్టారెంట్ ఏది? ఎక్కడుంది అనుకుంటున్నారా?
ఈ కింద ఇచ్చిన బిల్ చూస్తే మీకే తెలుస్తుంది...!


ఇదే కాదండి జింబాబ్వే లో ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఎందుకంటారా? ఆ దేశ ఆర్థిక పరిస్థితి అలా వుంది మరి.... మన దేశం లో 8% ద్రవ్యోల్బణం వున్నందుకే ధరలు ఇలా పెరిగి పోయాయి.. ఆదేశం ద్రవ్యోల్బణం గురించి వినేముందు ఒక్కసారి మీ గుండె దిటువు చేసుకోండి. ఆ దేశ ద్రవ్యోల్బణం 1,50,000% మరి భోజనానికి ఈ మాత్రం ధర వుండదా?

జనానికి సరిగా తిండి లేక విలవిలలాడి పోతున్న జింబాబ్వే పరిస్థితి గురించి తలచుకొంటే ఎవరికైనా బాధ కలగక మానదు. అక్కడ సగటున ప్రభుత్వోద్యికి నెలకు 6౦,౦౦౦ డాలర్ల జీతం వస్తుంది. అతని జీవితాంతం వచ్చిన డబ్బులు కనిసం ఒక వాటర్ బాటిల్ కూడా కొనలేని పరిస్థితి... ఆ బిల్ చూడండి మీకే తెలుస్తుంది...! బయట ఎమైనా కొనడానికి వేళ్ళాలంటే ఒక సంచి నిండా డబ్బులు తీసుకెళ్ళాల్సిందే... అందుకే ప్రభుత్వం అక్కడ 5 కోట్లు, ఒక కోటి డాలర్ల నోట్ ని విడుదల చేసింది.

ప్రజల వద్ద కోట్లకుకోట్ల డబ్బు వున్నా ఎమీ దొరకని పరిస్థితి. ఎందుకంటే అక్కడ పంటల దిగుబడి పూర్తీగా తగ్గి పోవడమే...

జీర్ణించు కోవడానికి మరో కష్టమయిన విషయం ఏమిటంటే, అక్కడి సగటు ఆయుః ప్రమాణం కేవలం 38 సంవత్సరాలే!

Saturday, May 3, 2008

చిన్నప్పుడు సరిగా చదువుకోక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యా.....

చిన్నప్పుడు సరిగా చదువుకోక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యా.....

ఎంటి వీడు ఇలా అంటున్నాడు అని అనుకుంటుంటున్నారా...? నేనే కాదు ౫౦% సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని అడిగితే ఇదే చెప్తారు...

ఇంటర్ డిగ్రీ చదివే రొజుల్లో ఎవరైన నీ ఎయిమ్ ఏంటి అని ఎవరైన అడిగితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని టక్కున చెప్పేవాన్ని.. అప్పుడు తెలియని తనం మరి...

ప్రొద్దునే లేట్ గా లేచి ఆఫీస్ కి వెళ్తూంటే వాడికేం బాబు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎప్పుడైనా వెళ్తాడు అనే వాళ్ళు.తిరిగొచ్చే టైం వాళ్ళకి తెలీదు కదా! అది అర్ధరాత్రో అప రాత్రో కావచ్చు లేకపోతే తరువాత రోజు ఉదయం ఐనా కావొచ్చు...

ఇక ఆపీస్ కి వెలితే టెస్టర్ కనిపిస్తాడు, గుడ్ మార్నింగ్ అంటాడు... దాని అర్ఠం నాకు నాలుగు మేజర్ బగ్స్ దొరికాయ్ నీకు ఈ రోజు మీ మేనేజర్ తో మూడింది అని... వాడు మనకు ఎన్ని సటైర్లు వేసినా ఓపిగ్గా వుండాలి... లేదంటే ఎప్పుడూ సరిగా పని చెయ్యని వాడు ఈ రోజు కసిగా పని చేసి మరి నాలుగు బగ్స్ వేస్తాడు మన పేరున..

ఇక ఆదివారం పని చేయల్సి వస్తే... అదో నరకం.... సాయంత్రం ఫ్రెండ్ ఫోన్ చేసి పరుగు సినిమా కి పరుగు పరుగున వచ్చెయ్ టికెట్లు దొరికాయ్ ఆంటాడు.... ఆ పాటికి ఫోన్ లో మాట్లాడినదంతా అర్థం చేసుకున్న టీం లీడ్ ఆలోచించు నేనే గనక నీ స్ఠానంలో వుండి వుంటే సినిమాకెళ్ళడానికి ఒకసారి ఆలోచించి వుండే వాడిని అని సినిమ కబుర్లు చెప్పి మనల్ని కన్ ఫ్యూజన్ లో పడేసి ఇంకా మనం ఏదో ఒకటి తేల్చుకొనే లోపే వద్దులే ఏం వెల్తావ్ రానని చెప్పు అని సినిమా మాన్పించేస్తాడు. ఫోన్ చేసి చెప్పెయ్ అంటాడు.

ఆర్నెళ్ళలొ ఒకసారి కాన్ఫరెన్స్ రూంకి పిలుస్తారు, అక్కడ మేనేజర్ టీం లీడ్స్ అందరూ ఒక్క సారిగా... నువ్వు అహా నువ్వు ఓహో అంటారు... ఒక లెటర్ చేతిలో పెట్టి ఎవరితోనూ డిస్కస్ చెయ్యకు టీం లో అందరికంటే నీకే ఎక్కువ శెనక్కాయలు అంటాడు... అక్కడ వాడు పొగుడుతూవుంటే timesjobs.com add first part గుర్తుకు వస్తుంది.... మన సీట్ కు వెళ్ళి చూసుకుంటే అదే add లో సెకండ్ పార్ట్ గుర్తుకొస్తుంది...

ఇక రాజకీయాలు కాలు లాగడాలు సరే సరి.....

తలచుకొన్నప్పుడల్లా చిన్నప్పుడు సరిగా చదివున్నింటే ఏ సివిల్సో ఎదో రాసి... మాంచి గవర్నమెంట్ వుద్యోగం పట్టి వుండే వాన్ని జీవితంలో వుద్యోగమే కాకుండా ఏదో కొన్ని మంచి వ్యాపకాలతో మజా చేసే వాన్ని.....ప్చ్.... ఎం చేద్దాం.....

avandia