Wednesday, April 4, 2007

బెలుం గుహలు



బెలుం గుహలు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కే తలమానికమైన ఈ ప్రదేశం చూడదగిన వాటిలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది। ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు కోటి రూపాయలు పైగా ఖర్చు చేసి దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు। 2002 లో మొట్ట మొదటి సారిగా సందర్శకులకు వెలుగులోకి వచ్చిన ఈ గుహలు దాదాపు భూమి లోపల దాదాపు 10 కి.మి వ్యాపించి వున్నాయి. చిన్న బావి ద్వారా లోపలికి ప్రవేశించే వరకు మనకు ఇలాంటి గుహలు ఇక్కడ వున్నాయి అని మనం అసలు ఊహించలేము, ఎందుకంటే ఈ గుహల పైభాగమంతా వ్యవసాయభూములున్నాయి. సహజసిద్దంగా నీటి ప్రవాహాల వల్ల ఏర్పడిన ఆకృతులు పైనుండి వేలాడుతూ అందరిని అబ్బురపరుస్తూ వుంటాయి.
దీని చరిత్ర పరిశీలిస్తే
4500 BC ఈ కాలం నాటి మట్టి పాత్రలు బయట పడ్డాయి
మధ్య కాలం లో జైనులు బౌద్దులు ఆక్రమించుకున్నారు
1884 రాబర్ట్ బ్రూస్ అను అతడు మొదటి సారిగా కనుగొన్నాడు
1982 డేనియల్ గేబర్ అను జర్మన్ దేశీయుడు
1988 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్రమించుకుంది
1999 టూరిజం శాఖ అభివృద్ది పరచింది
Feb-2002 ప్రజల సందర్శనార్టం అనుమతిఈ చక్కని ప్రదేశం బెంగళూరు నుండి 300km హిందూపురం నుండి 192km అనంతపురం నుండి 90km నంద్యాలనుండి75km తాడిపత్రి నుండి 35km హైదరాబాదు నుండి 320 km వుంటుంది.

చిత్రాలు : తెలుగు వికిపీడియ.

2 comments:

spandana said...

కర్నూలు దగ్గర ఇలాంటి గుహలున్నాయని విన్నాను. మీరు చెప్పేది అవేనా?

ఇక్కడ వర్జీనియాలో అలానే వున్న గుహలకు ఎంత పేరో! సందర్శకులు వాటి వల్ల్ అవస్తున్న ఆదాయం కూడా భారీనే! మనం ఇప్పటికి గుర్తించాం వీటిని!!

--ప్రసాద్
http://blog.charasala.com

Gems Of Hindupur said...

అవునండి, మీరు చెప్పేది నిజం, ఇక్కడే మా ఆఫీస్ లో చలా మంది ఆంధ్రా వారిని ఆడిగాను, వీటి గురించి తెలీదన్నారు అందుకే ఇది రాశాను, ఎప్పుడో2003 లో నేను వెల్లి వచ్చాను, మళ్ళీ వెళ్ళి వచ్చి ఇంకా వివరంగా రాస్తాను...

avandia