Sunday, May 17, 2009

లోక్ సత్తా తొలి విజయం...
జె.పి. ని గెలిపించినందుకు కూకట్ పల్లి ప్రజలను అభినందించాలి. జె.పి. అసెంబ్లీ లో ఆంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేస్తారని ఆశిద్దాం..మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టికి మరిన్ని సీట్లు వస్తాయని నాకు ఖచ్చితమైన నమ్మకం వుంది.

ఎన్నికలు ముగిశాయ్...

ఈ ఎన్నికల్లో చాలా విభిన్నంగా తమ మద్దతును కాంగ్రెస్ కు తెలిపారు..ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం...

ప్రతిసారి కేంద్రంలో ప్రభుత్వం.. ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మ కావడం.. ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన మెజార్టీ లేక తంటాలు పడుతూ వుండేది.

జయలలిత, లాలు, మాయావతి, లెఫ్ట్ పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతోందంటే నిజంగానే ప్రజల ఆలోచనా శక్తి కి అద్దం పడుతోంది.మరీ ఆంధ్రప్రదేశ్ ఫలితాలను చూస్తే ఆ విషయం మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కెసిఆర్ పీడ ఆంధ్రప్రదేశ్ కు విరగడైనందుకు ఒకసారి అందరూ దీపావళి జరుపుకోవచ్చు. మరో ఐదేళ్ళు ప్రశాంతంగా వుండొచ్చు.

Thursday, April 30, 2009

ప్రపంచంలో అతి ఖరీదయిన ప్రయోగం ఏమయ్యింది....?

కొన్ని రోజుల పాటు పత్రికల్లో ల్లో కలకలం రేపిన ప్రయోగం ఎమయ్యింది? మీకెప్పుడూ ఈ సందేహం రాలేదా?
ప్రపంచంలో అతి ఖరీదయిన ప్రయోగం( €3.2–6.4 billion) మరి!2008 సెప్టెంబర్ లో ఈ ప్రయోగం, అందులోని అయస్కాంతాల లోపం వల్ల ఆగి పోయింది. లోపాన్ని సరి చేసాం త్వరలోనే ప్రయోగాన్ని మళ్ళీ మొదలు పెడతాం అంటూ నిన్ననే పత్రికా ప్రకటన చేసారు శాస్త్రవేత్తలు.

all the best to CERN.

for details of press release
http://press.web.cern.ch/press/PressReleases/Releases2009/PR06.09E.html

శ్రీశ్రీ..

బి...క్క...చచ్చి.... పోయింది.... కవిత.
వెక్కివెక్కి ఏడ్చిం...ది!...
కన్నీరు క్రమంగా రంగు మారింది!

ఒక కంట్లోంచి.... నీలంగా సిరా ఒలికింది.
మరో కంట్లోంచి.... ఎర్రగా నెత్తురొస్తోంది.
రెండు అశ్రుబిందువులు కిందపడి మెరిశాయ్.. శ్రీశ్రీగా వెలశాయ్!


శ్రీశ్రీ.. గురించి మాట్లాడేంత గొప్పవాణ్ణి కాను. కాని తన గురించి తనికెళ్ళ భరణి గారు ఈనాడు లో రాసిన వ్యాసం చదివాను.

మీరూ చదవండి.

Monday, January 26, 2009

రాముడు తల దించుకున్నాడు.

ఈ వీడియో చూడండి.

http://in.youtube.com/watch?v=l7yg-bdlmko

శ్రీ రామ సేన అని పేరు పెట్టుకున్నారు. బావుంది... దేశ సంస్కృతిని కాపాడతామంటున్నారు. మరీ బావుంది... కాని మాటలకు చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. మంగళూరు పబ్ లో వున్న అమ్మాయిలను నానా రకాలుగా బహిరంగంగా హింసించారు... నిజంగా దేశ సంస్కృతిని దేశాన్ని తల దించుకొనేలా చేసారు. అమ్మయిలు పబ్ వెళ్ళడం దేశ సంస్కృతికి విరుద్దం అన్నారు... మరి అమ్మాయిలని హింసిచడం మన దేశ సంస్కృతేనా? అసలు రాజ్యాంగ విరుద్దంగా వ్యవరిస్తున్న వీరికి టెర్రరిస్టులకి ఏ మాత్రం తేడాలేదు.

దేశం లో పని లేని వెధవలందరూ ఇలా దేవుడి పేరు మతం పేరు చెప్పుకుంటూ.. తమ దగ్గరున్న గూండాలు రౌడీలతో అన్ని రకాల మారణహోమాలు సృష్టిస్తున్నారు.

అందుకే మనందరం ఇలాంటివాటిని ఖండిద్దాం... దేశ నిర్మాణానికి అడ్డంకిగా మారిన ఇలాంటి వ్యక్తులను సమాజంలో లేకుండా చేద్దాం....

avandia