Wednesday, May 2, 2007

తధాగతుడుఆ నాడు రాజాంగణంలో కాలసూచిక అర్ధ రాత్రిని సూచిన్నిస్తున్నది. ఎంతకూ ఎడ తెగని ఆలోచనలు యువరాజు అంతరంగాన్ని కలచి వేస్తున్నాయి, కృంగదీస్తున్నాయి ....

క్షణాలు వెనక్కు దొర్లాయి.......... ఆ రోజు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొన్నాడు సిద్దార్ఠుడు.
భారంతో ఓ ముదుసలి వణుకుతూ తన రథానికి ఆడ్డుగా వచ్చాడు. ఆతని ముఖం వికృతంగా ముడుతలుపడి వుంది, నడుం వంగి వుంది.... కంఠం కంపిస్తున్నది.... అడుగులు తడబడుతున్నాయి..... ఎవరతడు ఎందుకలా అయ్యాడు....?

సారధి వేషమని చెప్పాడు.


సారధి చెప్పింది నిజమేనా? అది వేషమే అయితే అలా లోకంలో లేని పాత్రను అతను ఎందుకు ధరించాడు అలా అభినయించగలిగాడు?????


మరో వీధిలో ఒక మానవాకారాన్ని ఒక కొయ్య చట్రం పైన వుంచి నలుగురు మోసుకెల్తున్నారు.వెనుక పదిమంది నడుస్తున్నారు.... దాన్ని తీసుకెళ్ళి నిప్పుతో కాలుస్తున్నారు....అది చూసి " ఆపండి ఈ ఆగడలను సహించబోడు" అంటూ రథం దిగబోయిన సిద్దార్థునికి అది మానవ శరీరం కాదు అని.. కొయ్య అని వినోదం కోసం అల చేస్తున్నారని చెప్పాడు.


సారధి ప్రసంగం అసంధర్భంగా తోచింది సిద్దార్థునికి.
ప్రక్కనే ఒక బాలుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు."బాబు ఎందుకేడుస్తున్నావు? ఎవరైనా ఎమైనా అన్నారా? నాకు చెప్పు నేను శిక్షింపజేస్తాను" అన్నాడు.


క్షణకాలం లో శుద్దోదనుని శాసనం పిల్లవాడికి గుర్తుకొచ్చింది. పిల్లవాడు ఆచార్యుల ఆదేశానుసారం రాగధ్యయనం చెస్తున్నానని అబద్దం చెప్పాడు.


యువరాజు మతి విచలితమయింది.


ఇలాంటివి చాలా చూసాడు..... ఎవరి మాటలు నిజాలుగా తోచట్లేదు....
తదేకంగా తన పుత్రున్ని చూస్తూ భవిష్యత్తును ఊహించాడు. రాహులున్ని కట్టెలపై వుంచారు... మండుతున్న కొరివితో కట్టెల్ని ముట్టించారు..... ఒక్క సారి మనస్సు జలదరించింది.. హృదయం ద్రవించింది... మనస్సు ఆక్రోశించింది..........


అతలాకుతలమవుతున్న తన మనసుని కుదుట పరచలేక సమాధానం కోసం మహా నిశీధిలో రాజసౌధాన్ని విడిచి బయలు దేరాడు......


రోజులు వారాలు నెలలు ..... అల నడుస్తూ వెళ్ళి నీరసించిపడిపోయాడు....

కనులు తెరిచాడు..... తను ఉన్నది తన తల్లి మాయాదేవి ఒడిలో అనుకున్నాడు.... కొద్ది సేపటి తరువాత గతం గుర్తొచ్చింది..... నా అశాంతిని బాపే ఉపాయం చెప్పమని అడిగాడు... "అత్మాహుతి మాత్రం కాదు..... జ్నానాన్వేషణలో శరీరాన్ని కృశింప చేయరాదని మీలోని దివ్యశక్తి మానవాలికి ప్రశాంతి ప్రదాయిని కావాలని" చెప్పింది...
వింటున్న సిద్దార్ఠునికి తొలిసారిగా ప్రపంచమూ ప్రకృతి గోచరించింది.......


చాలారోజులు అడవిలో వుంటూ కొందరు శ్రవణులతో కలసి వారిమాటలు వింటూ వారి సిద్దాంతాలు అర్థం చెసుకుంటూ కొన్నాళ్ళు గడిపాడు.....


వారి సిద్దాంతాలను అర్థం చెసుకొని వారి సాంగత్యం లో వివిధ మతాల సిద్దాంతాల్ని అధ్యయనం చెసాడు.......
చివరికి భోది వృక్షపు ఛాయలో ఆష్టాంగ సాధన కనిపెట్టి బుద్దుడైనాడు.....


ఆయన అష్టాంగ సాధన ఇది....


సమ్యగ్దృష్టి ---- సరియైన అవలోకన(అర్ఠం చేసుకోవడం)

సమ్యక్సంకలనము ---- సరియైన లక్ష్యము.

సమ్యగ్వచనము ---- సరియైన సంభాషణ

సమ్యక్కర్మ ---- సరియైన పనులు

సమ్యగా జీవనం ---- సరియైన జీవితాన్ని గడపడం

సమ్యగ్వ్యాయామాలు ---- సరియైన నడవడిక

సమ్యకృతి ---- సరియైన జ్నాపికలను నిలుపుకోవడం

సమ్యక్సమాధి ---- సరియైన ధ్యానాన్ని అలవర్చుకోవడం
వీటితో పాటు చతుస్సత్యములను నిత్యమూ గుర్తెరగాలని చెప్పాడు... అవి...
దుఃఖము

దుఃఖ కారణము

దుఃఖ నిరోదము

మరియు దుఃఖ నివారణమునకు ఆష్టాంగ సాధన.......

సత్యాహింసలు, శాంతి ధర్మాలు.. ఆయన ఉపదేశించిన ప్రధాన సూత్రాలు....
దేశం నలు మూలలనుండి ఎంతోమంది భోధనలకు ప్రభావితమయ్యరు... బౌద్దమతం విస్తరించింది....
కన్నులతోనే సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించి ప్రజల హృదయాలపైన చెరగని ముద్రను వేశాడు......


బుద్ద పౌర్ణమి సంధర్భంగా .......
మూలం :తధాగతుని కథ - నెట్యం రతన్ బాబు.

avandia