సూది మొన ఆనినంత భూమిని
సైతంవదలకుండా ఆక్రమించుకుంటూ
నీటిని ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్లలో నించి అమ్ముకుంటూ
గాలిని(ఆక్సిజన్ బాక్స్) పెట్టెల్లో బంధించి
సొమ్ము చేసుకొంటూ
నిప్పును సిలిండర్ లో నింపి వెలుగుకు వెలకడుతూ
చంద్రున్ని, ఆకాశాన్ని ప్లాట్లుగా చేసి
నిస్సిగ్గుగా మనిషి జేవితాన్ని శిలువ వేస్తూ
భూమి
నీరు
గాలి
నిప్పు
ఆకాశం
ప్రకృతి ప్రసాదించిన ప్రాణ ప్రదమైన అవసరాలన్నిటిని
కాసుల కోసం రాసులుగా పోసి
పంచభూతాలని వ్యాపార వస్తువులుగా చేసి
భూమండలంలో డబ్బు వున్నవాడే బతకాలని
లేనినాడు లేనివాడు తప్పకుండా చావాలని
భూమి నీరు గాలి నిప్పు ఆకాశం
వ్యాపార వస్తువులైతే చావక చస్తాడా
పంచ భూతాలు పంచ ప్రాణాలు తీస్తుంటే
క్షణ కాలం జీవిస్తాడా
మనుషుల జీవితాల్ని శాసిస్తున్న కార్పోరేట్ వ్యాపారానికి
నా రెండు పాద రక్షలతో నమస్కారం
వై। శ్రీరాములు గారిమూడు ఎడారులు ఏడు సముద్రాలు ఒకే ఒక్క అనంతపురం పుస్తకం లో నుండి నాకు నచ్చినవాటిలో మరొకటి..
చెప్పాలంటే ప్రతికవిత, తన మానవతా దృష్టికి అద్దం పడుతోంది।నాకు పుస్తకం బాగా నచ్చింది, ఈ మధ్యనే చదివాను॥
No comments:
Post a Comment