Friday, March 9, 2007

యువతకు సిగ్గు చేటు ---- పూనే రేవ్ పార్టీ


ఇటీవల పూనే నగరం లో రేవ్ పార్టీ జరుపుకొంటూ పట్టుబడిన 251(వీరిలో 29 మంది అమ్మాయిలుకూడా వున్నారు. )మంది యువతను చూస్తోంటే పట్టాలు తప్పి ఫశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు తీస్తున్న భారత యువతకు అద్దం పడుతోంది. ఇన్ని రోజులు కేవలం విదేశాలకే పరిమితమైన ఇలాంటి దిక్కుమాలిన పార్టీల కోరల్లో మన దేశపు యువత చిక్కుకోవడం కొంత భాదను కలిగించే విషయం
ఇవన్నిటికీ కారణం యువతలో భాద్యతా రాహిత్యమా? వారిలో కొరవడిన అవగాహన? లేకపోతే తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? లేక ఇవన్నీనా?

కనీసం ఒక్కసారైనా వాళ్ళు ఇలా జరుగుతుందని ఊహించుంటే ఇలా జరిగి వుండేదా? ఇలా చేయడం తప్పు అని వారికి తెలియదా? పట్టుబడిన వారందరూ విద్యావంతులే, ఉన్నత సమాజానికి చెందిన వారే, కాని ఇలా ఎందుకు జరిగింది? ఇంత జరిగిన తరువాత కూడా కొంత మంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు మాదక ద్రవ్యాలంటే ఎమో తెలీదు అని వెనకేసుకు రావటం విస్మయం కలిగించే విషయం. మనం రోజూ వీక్షించే orkut ద్వారానే వీరందరూ తమ పార్టీ సన్నాహాలను పూర్తీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడూ తమ పిల్లల చదువుల సంగతే కాకుండా, వయసుకు తగ్గట్టుగా మారే పిల్లల మనస్తత్వాన్ని పరిశీలించి వారిని సన్మార్గంలో పెట్టగలిగినప్పుడే ఇలాంటివి మరీ మరీ జరగకుండా నివారించవచ్చు.



No comments:

avandia