Thursday, April 12, 2007

కొత్త వాన లోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా........?




ఈ రోజు మా వూళ్ళో వర్షం వచ్చింది..... తొలకరి జల్లుల్లో తడిసి ఇప్పుడే ఈ బ్లాగ్ రాస్తున్నాను. ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చిరు జల్లులు మొదలయ్యాయి... ఆ వాసన ఆస్వాదిస్తోంటే చిన్నప్పటి జ్నాపకాలన్ని అలా నా కనులముందు పలకరిస్తూ మనసుని ఆహ్లాద పరుస్తూ అలా మాయమయిపోయాయి.
చిన్నప్పుడు మా పల్లెలో వర్షం వచ్చినప్పుడు ఆడుకున్న పడవల ఆట, వడగళ్ల వాన పడ్డప్పుడు వడగళ్ళతో ఆడిన ఆటలన్నీ గుర్తుకు వచ్చాయి....
జ్నాపకాలు జీవితంలో ఆనందాన్ని తెస్తాయి.... జ్నాపకాలు అంటే ఇంకోటి గుర్తొచ్చింది... నేను ఇంటర్ లో వున్నప్పుడు నాకు చాలా సన్నిహితుడైన వాడితో గొడవ పడ్డాను.... అప్పుడు ఇంకొక మితృడు వచ్చి.. మీ ఇద్దరి మధ్య గొడవ మాయం అవ్వాలంటే మీ ఇద్దరి మధ్య జరిగిన మంచి సంఘటనలు గుర్తు తెచ్చుకొమ్మని చెప్పాడు... అది చాలా దోహదపడింది.....
మొత్తానికి ఈ రోజు ఈ సంవత్సరంలో అన్నింటికన్నా ఆహ్లాదకరమైన రోజు......

No comments:

avandia