Friday, April 20, 2007

కార్డులు చెప్పిన కథ....



ఈ కార్డు ముక్కలేంటి?? ఈ భాష ఏంటి? ఈ దిలీప్ కుమార్ చక్రబోర్తి ఎవరు? అని చూస్తున్నారా?
అర్టం కావడం లేదు కదూ........................................ :-)
ఏం పర్వాలేదు... నాకు కూడా ఏమి అర్ఠం కాలేదు.....అది రాసిన భాష బెంగాలి అని తప్ప...
ఇంతకీ వీడి బాధ ఏంటి అనుకొంటున్నారా... చెబుతాను....
ముందు శనివారం నాడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక, ఉత్తరాల పెట్టెలో మనకేమైనా ఉత్తరాలొచ్చాయా అని చూసాను। అందులో ఈ రెండు పోస్ట్ కార్డులు కనిపించాయి। మనకు కార్డు రాసిన వాడెవడా అని చూసాను। అది ఎవరో దిలిప్ కుమార్ చక్రబోర్తి కి రాసిన ఉత్తరాలు। అంతేకాక ఇవి రెండూ మా ఇంటికి రాసిన ఉత్తరాలు కావు. మొత్తం బెంగాలి లో రాసుండడం వల్ల నాకు తెలిసిన రెండు మూడు బెంగాలి అక్షరాలు ఎక్కడయినా కనిపిస్తాయేమో అని చూసాను. హౌరా లో హ... కోల్ కతా లోని క... వీటి కోసం వెటికాను... కాని లాభం లేక పోయింది. వాటిని ఆటు, ఇటు తిప్పి చూస్తే అర్థం అయింది... ఇవి ఎప్పుడో డెబ్బయ్ లలో రాసిన వుత్తరాలు అని... ఒకటి 1972 ఇంకొకటి 1976.
పాకిస్థాన్ నుండి మరొకటి బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఉత్తరాలివి.
వీటిలో ఎదో కిరికిరి ఉందిరా అనుకున్నా.... ఇంక తీసుకువచ్చి చూసాను॥ పోస్టల్ స్టాంప్ ఎక్కడిదా అని ॥ ఆప్పుడు కొంచెం కొంచెం కథ అర్థం అయింది. ఆ రెండు ఉత్తరాలు నిజానికి రాసింది ఒక ఊరు నుండే!చాంద్ పూరని బంగ్లాదేశ్ లోని ఓ చిన్న ఊరు. ఇంతలో మా బెంగాలీ రూమ్ మేట్ ఆఫీస్ నుండి వచ్చాడు......ఇద్దరూ ఒకే ఆఫీస్ లోనే పని చేస్తున్నా నేను చాల పంక్చువల్ కనుక ॥ ముందే వచ్చెసా, వాడు రాగానే రెండు ఉత్తరాలు వాడి చేతిలొ పెట్టి చదువు గట్టిగా అన్నాను, వాడు చదివిన దాని ప్రకారం .. వాటిలో ఏ నక్సల్, తీవ్రవాద రహస్యాలేమి రాసి లేవు. అవి మామూలు కుశల ప్రశ్నలు వేసిన ఉత్తరాలే.కాని అవి చారిత్రాత్మక ఉత్తరాలు .. నలభై ఏళ్ళ క్రితం రాసినందుకు మాత్రమే కాదు, ఈ రెండు ఉత్తరాలు టూకీగా మనకు బంగ్లాదేశ్ చరిత్ర చెబుతాయి ..


During the partition of India into India and Pakistan in 1947 Bengal was also divided on purely religious basis with Hindu dominated Western part of Bengal going to India and the Eastern part with majority of Muslims going to Pakistan. This East Bengal was called East Pakistan which was separated by around 1600 kilometers from West Pakistan. The Eastern wing which was dominated by Bengali speaking population, was dissatisfied with the government based in Western wing over economic and cultural issues. Poor response from the government after the devastation of coast of East Pakistan by a massive cyclone in 1970 outraged population of East Bengal. This eventually led to Bangladesh Liberation War which lasted for 9 months. Around 3 million were massacred and millions fled to neighboring India, mainly to Calcutta. In December 1971 the war received support from Indian Armed forces and a decisive victory of India on Pakistan on 16th December 1971 led to the independence of Bangladesh under the leadership of Sheikh Mujibur Rahman.
After independence of Bangladesh it became a parliamentary democracy and first parliamentary elections were held in the year 1973. antey aa paina unna modati uttaram dated 08.07.1972 ee transition period ( from East Pakistan – Bangladesh) lo raasinadi .. mari aa rendava uttaram .. modati prabhutwam erpadina tarvata raasinadi ..
Bangladesh never actually recovered from the political violence and turmoil and nor did Calcutta ever recover from the problems aroused from the infiltrated refugees from Bangladesh. Bangladesh has had 13 different heads of government and at least four military coups since independence. Even today if you walk through the streets of Kolkata, you find a number of ghettos and large number of people starving on footpaths. Neither could they ever go back to their home land nor could they ever ascertain themselves in Kolkata.
Even after the repeated examples from history of the ill effects of partition, whether it is partition of India and Pakistan, or partition of Pakistan or it is partition of Uttar Pradesh and Uttaranchal, or it is Bihar and Jharkhand..
I personally just do not want Andhra Pradesh and Telangana to be added to this list of partitioned.




Thursday, April 12, 2007

కొత్త వాన లోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా........?




ఈ రోజు మా వూళ్ళో వర్షం వచ్చింది..... తొలకరి జల్లుల్లో తడిసి ఇప్పుడే ఈ బ్లాగ్ రాస్తున్నాను. ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చిరు జల్లులు మొదలయ్యాయి... ఆ వాసన ఆస్వాదిస్తోంటే చిన్నప్పటి జ్నాపకాలన్ని అలా నా కనులముందు పలకరిస్తూ మనసుని ఆహ్లాద పరుస్తూ అలా మాయమయిపోయాయి.
చిన్నప్పుడు మా పల్లెలో వర్షం వచ్చినప్పుడు ఆడుకున్న పడవల ఆట, వడగళ్ల వాన పడ్డప్పుడు వడగళ్ళతో ఆడిన ఆటలన్నీ గుర్తుకు వచ్చాయి....
జ్నాపకాలు జీవితంలో ఆనందాన్ని తెస్తాయి.... జ్నాపకాలు అంటే ఇంకోటి గుర్తొచ్చింది... నేను ఇంటర్ లో వున్నప్పుడు నాకు చాలా సన్నిహితుడైన వాడితో గొడవ పడ్డాను.... అప్పుడు ఇంకొక మితృడు వచ్చి.. మీ ఇద్దరి మధ్య గొడవ మాయం అవ్వాలంటే మీ ఇద్దరి మధ్య జరిగిన మంచి సంఘటనలు గుర్తు తెచ్చుకొమ్మని చెప్పాడు... అది చాలా దోహదపడింది.....
మొత్తానికి ఈ రోజు ఈ సంవత్సరంలో అన్నింటికన్నా ఆహ్లాదకరమైన రోజు......

Wednesday, April 4, 2007

బెలుం గుహలు



బెలుం గుహలు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కే తలమానికమైన ఈ ప్రదేశం చూడదగిన వాటిలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది। ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు కోటి రూపాయలు పైగా ఖర్చు చేసి దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు। 2002 లో మొట్ట మొదటి సారిగా సందర్శకులకు వెలుగులోకి వచ్చిన ఈ గుహలు దాదాపు భూమి లోపల దాదాపు 10 కి.మి వ్యాపించి వున్నాయి. చిన్న బావి ద్వారా లోపలికి ప్రవేశించే వరకు మనకు ఇలాంటి గుహలు ఇక్కడ వున్నాయి అని మనం అసలు ఊహించలేము, ఎందుకంటే ఈ గుహల పైభాగమంతా వ్యవసాయభూములున్నాయి. సహజసిద్దంగా నీటి ప్రవాహాల వల్ల ఏర్పడిన ఆకృతులు పైనుండి వేలాడుతూ అందరిని అబ్బురపరుస్తూ వుంటాయి.
దీని చరిత్ర పరిశీలిస్తే
4500 BC ఈ కాలం నాటి మట్టి పాత్రలు బయట పడ్డాయి
మధ్య కాలం లో జైనులు బౌద్దులు ఆక్రమించుకున్నారు
1884 రాబర్ట్ బ్రూస్ అను అతడు మొదటి సారిగా కనుగొన్నాడు
1982 డేనియల్ గేబర్ అను జర్మన్ దేశీయుడు
1988 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్రమించుకుంది
1999 టూరిజం శాఖ అభివృద్ది పరచింది
Feb-2002 ప్రజల సందర్శనార్టం అనుమతిఈ చక్కని ప్రదేశం బెంగళూరు నుండి 300km హిందూపురం నుండి 192km అనంతపురం నుండి 90km నంద్యాలనుండి75km తాడిపత్రి నుండి 35km హైదరాబాదు నుండి 320 km వుంటుంది.

చిత్రాలు : తెలుగు వికిపీడియ.

avandia