Saturday, May 3, 2008

చిన్నప్పుడు సరిగా చదువుకోక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యా.....

చిన్నప్పుడు సరిగా చదువుకోక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యా.....

ఎంటి వీడు ఇలా అంటున్నాడు అని అనుకుంటుంటున్నారా...? నేనే కాదు ౫౦% సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని అడిగితే ఇదే చెప్తారు...

ఇంటర్ డిగ్రీ చదివే రొజుల్లో ఎవరైన నీ ఎయిమ్ ఏంటి అని ఎవరైన అడిగితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని టక్కున చెప్పేవాన్ని.. అప్పుడు తెలియని తనం మరి...

ప్రొద్దునే లేట్ గా లేచి ఆఫీస్ కి వెళ్తూంటే వాడికేం బాబు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎప్పుడైనా వెళ్తాడు అనే వాళ్ళు.తిరిగొచ్చే టైం వాళ్ళకి తెలీదు కదా! అది అర్ధరాత్రో అప రాత్రో కావచ్చు లేకపోతే తరువాత రోజు ఉదయం ఐనా కావొచ్చు...

ఇక ఆపీస్ కి వెలితే టెస్టర్ కనిపిస్తాడు, గుడ్ మార్నింగ్ అంటాడు... దాని అర్ఠం నాకు నాలుగు మేజర్ బగ్స్ దొరికాయ్ నీకు ఈ రోజు మీ మేనేజర్ తో మూడింది అని... వాడు మనకు ఎన్ని సటైర్లు వేసినా ఓపిగ్గా వుండాలి... లేదంటే ఎప్పుడూ సరిగా పని చెయ్యని వాడు ఈ రోజు కసిగా పని చేసి మరి నాలుగు బగ్స్ వేస్తాడు మన పేరున..

ఇక ఆదివారం పని చేయల్సి వస్తే... అదో నరకం.... సాయంత్రం ఫ్రెండ్ ఫోన్ చేసి పరుగు సినిమా కి పరుగు పరుగున వచ్చెయ్ టికెట్లు దొరికాయ్ ఆంటాడు.... ఆ పాటికి ఫోన్ లో మాట్లాడినదంతా అర్థం చేసుకున్న టీం లీడ్ ఆలోచించు నేనే గనక నీ స్ఠానంలో వుండి వుంటే సినిమాకెళ్ళడానికి ఒకసారి ఆలోచించి వుండే వాడిని అని సినిమ కబుర్లు చెప్పి మనల్ని కన్ ఫ్యూజన్ లో పడేసి ఇంకా మనం ఏదో ఒకటి తేల్చుకొనే లోపే వద్దులే ఏం వెల్తావ్ రానని చెప్పు అని సినిమా మాన్పించేస్తాడు. ఫోన్ చేసి చెప్పెయ్ అంటాడు.

ఆర్నెళ్ళలొ ఒకసారి కాన్ఫరెన్స్ రూంకి పిలుస్తారు, అక్కడ మేనేజర్ టీం లీడ్స్ అందరూ ఒక్క సారిగా... నువ్వు అహా నువ్వు ఓహో అంటారు... ఒక లెటర్ చేతిలో పెట్టి ఎవరితోనూ డిస్కస్ చెయ్యకు టీం లో అందరికంటే నీకే ఎక్కువ శెనక్కాయలు అంటాడు... అక్కడ వాడు పొగుడుతూవుంటే timesjobs.com add first part గుర్తుకు వస్తుంది.... మన సీట్ కు వెళ్ళి చూసుకుంటే అదే add లో సెకండ్ పార్ట్ గుర్తుకొస్తుంది...

ఇక రాజకీయాలు కాలు లాగడాలు సరే సరి.....

తలచుకొన్నప్పుడల్లా చిన్నప్పుడు సరిగా చదివున్నింటే ఏ సివిల్సో ఎదో రాసి... మాంచి గవర్నమెంట్ వుద్యోగం పట్టి వుండే వాన్ని జీవితంలో వుద్యోగమే కాకుండా ఏదో కొన్ని మంచి వ్యాపకాలతో మజా చేసే వాన్ని.....ప్చ్.... ఎం చేద్దాం.....

8 comments:

చైతన్య క్రిష్ణ పాటూరు said...

కార్తీక్,

బావుంది సాఫ్ట్వేర్ ఇంజనీరు పశ్చాతాపం. కాకపోతే మన కంపెనీలో ఇచ్చేవాటిని శనక్కాయలనటం కన్నా కందిగింజలంటే సబబుగా వుంటుంది. లేకపోతే జనం అపార్ధం చేసుకుని వచ్చి చేరిపోయే ప్రమాదం వుంది :-)

BHARAT said...

ఇది చదువుతుంటే నా "బఠాని ,కలగపులగం " గుర్తుకు వచ్చాయి

http://kotthachiguru.blogspot.com/2008_01_01_archive.html

మీ కంపేని లో కందిపప్పులు ఐన ఇస్తారు మా దాంట్లొ ఐతె చందమామ ని చూపించి అదుగో వచెస్తొంది అంటారు (ఆరు నెలల తరువత ఇస్తారు మరి !!)

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

మీ అందరికి సెనక్కాయలు కంది గింజలు అయినా ఇస్తారు
మాకితే నూగుపప్పు బద్దలే దొరుకుతాయి
పేరుకి పని చేసేది మాత్రం MNC లో
చదువు పేరు చెప్పి మా సగం జీతం వాళ్ళే తీసేసుకుంటున్నారు గా :(:(:(:(

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

ramya said...

@ Gems Of Hindupur గతం లో ట్రెక్కింగ్ గురించి వివరాలు అడిగారు.మేం వెళదామని కనుక్కుంటే ఇంకా ఏమీ నిర్ణయించలేదట, అధికారులు హడవిడిగా ప్రకటించేసారట.
ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక గ్రూప్ గా వస్తే నామినల్ ఫీ తో ఒక రోజు కోసం పర్మిషన్‌ ఇస్తారట.ఇప్పటికైతే వారు ఏమీ ప్రొవైడ్ చేయరంట.

VAMSI said...

msi

VAMSI said...

what sir?nenu edho software engineer ayyi edho life enjoy cheddam ante govt.job adhi idhi antaru?
naalanti vallu emi avvali cheppandi?


-->vamsi,mca@svu

avandia