ఇదేంటి.. ఏ బిల్ గేట్స్ తినేదో లేక ఎదో సౌది రాజు గారు తినే భోజనం విలువ అనుకున్నారా?
కానేకాదు....
అక్కడ మీరు తిన్నా నేను తిన్నా అంతే అవుతుంది... ఆలాంటి రెస్టారెంట్ ఏది? ఎక్కడుంది అనుకుంటున్నారా?
ఈ కింద ఇచ్చిన బిల్ చూస్తే మీకే తెలుస్తుంది...!
ఇదే కాదండి జింబాబ్వే లో ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఎందుకంటారా? ఆ దేశ ఆర్థిక పరిస్థితి అలా వుంది మరి.... మన దేశం లో 8% ద్రవ్యోల్బణం వున్నందుకే ధరలు ఇలా పెరిగి పోయాయి.. ఆదేశం ద్రవ్యోల్బణం గురించి వినేముందు ఒక్కసారి మీ గుండె దిటువు చేసుకోండి. ఆ దేశ ద్రవ్యోల్బణం 1,50,000% మరి భోజనానికి ఈ మాత్రం ధర వుండదా?
జనానికి సరిగా తిండి లేక విలవిలలాడి పోతున్న జింబాబ్వే పరిస్థితి గురించి తలచుకొంటే ఎవరికైనా బాధ కలగక మానదు. అక్కడ సగటున ప్రభుత్వోద్యికి నెలకు 6౦,౦౦౦ డాలర్ల జీతం వస్తుంది. అతని జీవితాంతం వచ్చిన డబ్బులు కనిసం ఒక వాటర్ బాటిల్ కూడా కొనలేని పరిస్థితి... ఆ బిల్ చూడండి మీకే తెలుస్తుంది...! బయట ఎమైనా కొనడానికి వేళ్ళాలంటే ఒక సంచి నిండా డబ్బులు తీసుకెళ్ళాల్సిందే... అందుకే ప్రభుత్వం అక్కడ 5 కోట్లు, ఒక కోటి డాలర్ల నోట్ ని విడుదల చేసింది.
ప్రజల వద్ద కోట్లకుకోట్ల డబ్బు వున్నా ఎమీ దొరకని పరిస్థితి. ఎందుకంటే అక్కడ పంటల దిగుబడి పూర్తీగా తగ్గి పోవడమే...
జీర్ణించు కోవడానికి మరో కష్టమయిన విషయం ఏమిటంటే, అక్కడి సగటు ఆయుః ప్రమాణం కేవలం 38 సంవత్సరాలే!
Saturday, June 14, 2008
Subscribe to:
Posts (Atom)