మన నాయకులు మరో తోలుబొమ్మను దేశాధ్యక్ష పదవిని ఎక్కించారు.బహుశా... ఇంత వరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఇదేనేమో కొంచెం పోటా పోటీగా జరిగిన ఎన్నికలు.ఎలా జరిగితే ఏంటి? ఒరిగేదేం లేదుకదా.....చిన్నప్పుడు సాంఘికశాస్త్రం పుస్తకాల్లో రాష్ట్రపతి "రబ్బర్ స్టాంప్" లాంటి వాడు అంటే సరిగా అర్ఠమయ్యి చచ్చేది కాదు... ప్రతి బిల్లు, ప్రతి శాసనం రాష్ట్రపతి సంతకం లేనిదే అమలు జరగదు కాని ఏంచేద్దాం...? అతను కేవలం సంతకం మాత్రమే చేయాలి....( క్షమించండి అతను/ఆమె) అప్పుడెప్పుడో అబ్దుల్ కలాం బిల్లు తిప్పి పంపాడన్న విషయం తప్ప, రాష్ట్రపతి గురించి వార్తలు మనం కేవలం ప్రారంభోత్సవాలు, పట్టా ప్రధానోత్సవాలు, బహుమతి ప్రధానోత్సవాలు, ప్రమాణ స్వీకారోత్సవాలు లాంటివి తప్ప ఇంకోచోట చూడం.
ఇదంతా ఇలా జరగడానికి ఏదైనా కారణం కావొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం లో వున్నప్పుడు వారి అభ్యర్ఠిని, మరో ప్రభుత్వం వారి అభ్యర్ఠిని ఇలా... ఎన్నుకొని వాళ్ళ పనులని జరిపించుకొంటున్నారే తప్ప, దేశానికి రాష్ట్రపతి ఎలాంటి వాడుకావాలి? అని ఎవరూ అలోచించరు...
అబ్దుల్ కలాం ఇప్పటి వరకూ వున్న వారిలో కొంచెం బెటర్ ...

దేశ ప్రజలకు తన చివరి సందేశాన్ని ఇలా పంపారు....
"మై నిరంతర్ చడా... చడతారహా, శిఖర్ కహ హై మేరే ఈశ్వర్?
మై నిరంతర్ ఖోజ్ తా రహా, ఖోజ్ తా రహా,
జ్నాన్ కా భండార్ కహాహై మేరె ఈశ్వర్?
మై నావ్ ఖేతా రహ.. ఖేతా రహ....
శాంతీ కా ద్వీప్ కహ హై మేరే ఈశ్వర్...?
హే మేరే ఈశ్వర్,
మేరా దేశ్ కో దూర్ దృష్టి ఔర్ మెహనత్ సె ఆనంద్ ప్రాప్తి కా వర్ధన్ దో..."
ఈ సారైనా ఈ రాష్ట్రపతి అలా చెయ్యరని ఆశిద్దాం...
ఈ సారైనా ఈ రాష్ట్రపతి అలా చెయ్యరని ఆశిద్దాం...